Sun Dec 29 2024 00:35:52 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత పిటీషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ కవితది అక్రమ అరెస్ట్ అంటూ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత శుక్రవారం కవితను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో సోదాలు జరిపి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
అక్రమ అరెస్ట్ అంటూ...
కవితకు ఏడు రోజుల కస్టడీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కవిత భర్త అనిల్ కుమార్ ఈ అరెస్ట్ పై అఫడవిట్ దాఖలు చేయనున్నారు. నిన్నటి నుంచి ఈడీ కార్యాలయంలో కవితను అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన కవిత గతంలో వేసిన పిటీషన్ విచారణకు రానున్న సందర్భంలో ఆమెను అరెస్ట్ చేశారంటూ అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్రావులు ఢిల్లీ చేరుకుని న్యాయనిపుణులతో చర్చించారు.
Next Story