Fri Dec 27 2024 03:41:01 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో నేడు కవిత దీక్ష
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగుతున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగుతున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ కవిత ఈ దీక్షను చేపట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మహిళ సంఘ ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా దీక్షలో పాల్గొంటున్నారు.
16 పార్టీలకు చెందిన...
దీంతో పాటు పదహారు పార్టీలకు చెందిన నేతలు ఈ దీక్షలో పాల్గొని మహిళ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్న డిమాండ్ చేయనున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ దీక్షను ప్రారంభించి ప్రసంగించనున్నారు. జంతర్ మంతర్ వద్ద తొలుత ఆంక్షలు విధించినప్పటికీ చివరకు అక్కడే దీక్ష చేేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
Next Story