Mon Jan 06 2025 12:36:48 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ ఆఫీసుకు కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. మూడోసారి కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారు. తన ఫోన్లను మీడియాకు చూపిస్తూ కల్వకుంట్ల కవిత ఈడీ ఆఫీస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. నిన్నటి విచారణలో ఈడీ అధికారులు ఫోన్లను తీసుకురావాలని చెప్పి ఉంటుందని, అందుకే ఆమె తను వినియోగించిన ఫోన్లను మీడియాకు చూపించారని తెలుస్తుంది.
9 ఫోన్లను...
తాను ఫోన్లను ధ్వసం చేయలేదని, అందుకే మీడియాకు చూపిస్తున్నానని కవిత ప్రజలకు చెప్పదలచుకున్నారు. అందుకే 9 ఫోన్లను ఆమె వాహనంలో నుంచే మీడియాకు చూపారు. ఈరోజు విచారణ అంతా ఫోన్లపైనే జరిగే అవకాశముందని తెలిసింది. తన న్యాయవాదులతో కలసి కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులకు ఈ ఫోన్లను కవిత విచారణ సందర్భంగా అందచేయనున్నారు. తన ఫోన్లను ఈరోజు ఈడీ కార్యాలయంలో అప్పజెప్పడానికి కూడా వచ్చానని, ఈడీ తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆమె ఈడీ డైెరెక్టర్ కు లేఖ కూడా రాశారు.
Next Story