Tue Jan 07 2025 21:57:04 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ చేరుకున్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు. దాదాపు పద్దెనిమిది పార్టీలకు చెందిన నేతలకు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్ ఐదు గంటల వరకూ జరగనుంది. పార్లమెంటులో మహిళ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.
రేపు ఈడీ ముందుకు...
ఈనెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీల నేతలతో కలసి కవిత ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రేపు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట కల్వకంట్ల కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమెను రెండో సారి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈరోజు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించనుంది.
Next Story