Sat Apr 12 2025 19:07:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రికి కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వచ్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయని ఏఐజీ వైద్యులు తెలిపారు. అయితే కవితకు కేవలం ఆరోగ్య పరీక్షలను మాత్రమే చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
వైద్య పరీక్షల నిమిత్తం...
కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో నాలుగు నెలలకు పైగానే ఉండటంతో ఆమెకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గైనిక్ సమస్యలు కూడా వచ్చాయి. తీహార్ జైలులో ఉంటూ పలుమార్లు అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలో ఎయిమ్స్ లోనూ చికిత్స పొందారు. బెయిల్ పై విడుదలయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న కవిత నేడు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.
Next Story