Wed Nov 06 2024 01:36:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురు.. పిటీషన్ల తిరస్కరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఐదు రోజుల కస్డడీకి సీబీఐ అధికారులు కోరారు. కవితను విచారించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి అని సీబీఐ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు. ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత భాగస్వామి అని నిందితుల వాట్సాప్ చాట్ ద్వారా స్పష్టమయిందని సీబీఐ అధికారులు కోరారు. కవిత పిటీషన్లను తిరస్కరించిన న్యాయస్థానం సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్ చేసింది.
మాగుంట ద్వారా...
వంద కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆ నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పగించారని సీబీఐ అంటుంది. కవిత సూచన మేరకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్ల రూపాయలు అందచేశారని, ఒకసారి పదిహేను కోట్లు, మరొక సారి పదికోట్లు అందచేశారని పేర్కొంది. ఈ విషయాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారని కూడా సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత కుట్రదారు అని, విచారణకు సహకరించకపోవడం వల్లనే మరోసారి విచారించడానికి అనుమతివ్వాలని సీబీఐ కోరింది.
ఒకే కేసులో...
అయితే ఒకే కేసులో అరెస్టయి ఉన్న కవితను మరోసారి మరొక సంస్థ అరెస్ట్ చేయడం ఏంటని కవిత తరుపున న్యాయవాదులు ప్రశ్నించారు. కవితను రాజకీయ కారణాలతోనే ఇబ్బంది పెట్టేందుకు ఈ కేసులో ఇరికించారని అన్నారు. ఆమె ప్రైవసీకి భంగం కలిగించే ఆరోపణలు చేేస్తున్నారని కూడా న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కవితకు ఈ కేసుతో ప్రమేయం లేదని కూడా తెలిపారు. ఇరువర్గాల వాదన విన్న న్యాయస్థానం తొలుత తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత ఆమె తరుపున న్యాయవాదుల పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. సీబీఐ కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసింది.
రాత్రి 10.30 గంటలకు అరెస్ట్ చేసి...
తాను లీగల్ అడ్వయిజర్ ను కోరినా ఇవ్వలేదని, రాత్రి 10.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపించారని కవిత మీడియాకు తెలిపారు. తనను ఇదే కేసులో మళ్లీ అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. కక్ష సాధింపు ధోరణి ఇందులో కనపడుతుందని ఆమె అన్నారు. తనకు ఈకేసులో ఎలాంటి ప్రమేయం లేకపోయినా రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేశారన్నారు. తాను ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని ఆమె తెలిపారు. న్యాయం తనకు అనుకూలంగా వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story