Sun Dec 22 2024 20:00:24 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత నిరాశలో ఉన్నారా? ఆహారం తీసుకోవడం లేదా?
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత తరచూ అస్వస్థతకు గురవుతున్నారు
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నాలుగు నెలల నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లారు. తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. జైలులో ఉండటం, బెయిల్ రాకపోవడంతో కవిత కొంత నిరాశకు గురయినట్లు సమాచారం.
బరువు తగ్గడంతో...
అందుకే జైలులో ఆమెకు ఇస్తున్న ఆహారాన్ని కూడా సక్రమంగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. కల్వకుంట్ల కవిత నాలుగు నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా, ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలిసింది.
Next Story