Wed Jan 08 2025 18:22:28 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. 16 పార్టీల నేతలతో కలసి దీక్ష చేయనున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కవిత 16 పార్టీల నేతలతో కలసి దీక్ష చేయనున్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరుతూ ఆమె శుక్రవారం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి కవితతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు జాగృతి సంస్థ నేతలు కూడా చేరుకున్నారు.
16 పార్టీల నేతలతో...
దీక్ష కోసం జంతర్ మంతర్ వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. కవితతో పాటు శివసేన, ఎన్సీపీ, పీడీపీ, అకాలీదళ్, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలకు చెందిన మహిళ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కవిత రేపు దీక్ష చేయనున్నారు. ఎల్లుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
Next Story