Sun Dec 22 2024 21:09:38 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేడు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు న్యాయస్థానంలో సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు న్యాయస్థానంలో సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సీీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు. కవితను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరనున్నారు.
ఈడీ అరెస్ట్ చేసి...
ఇప్పటికే కవితను ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి పది రోజులు కస్టడీ అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించడంతో కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే నేడు కవిత రెగ్యులర్ పిటీషన్ ను కూడా ఆమె తరుపున న్యాయవాదులు దాఖలు చేయనున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కవిత తరుపున న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.
Next Story