Sun Dec 22 2024 23:05:01 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేటితో కస్టడీ ముగింపు.. తిరిగి కోర్టుకు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కస్టడీ పూర్తి కావడంతో నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపర్చనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఆమె సీబీఐ కస్టడీ పూర్తి కావడంతో నేడు తిరిగి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేేసినప్పటికీ, ఆ తర్వాత సీబీఐ కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ తీహార్ జైలులో విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు చూపించింది.
మూడు రోజుల కస్టడీ...
అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా తమకు ఐదు రోజుల కస్టడీకి కవితను ఇవ్వాలని సీబీఐ తరుపున న్యాయవాదులు కోరారు. విచారణలో కవిత నుంచి చాలా విషయాలు సేకరించి ఉందని తెలిపారు. దీంతో కవితను మూడు రోజుల పాటు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది. సీబీఐ కస్టడీ నేడు ముగియనుండటంతో ఆమెను అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.
Next Story