Sun Dec 22 2024 13:28:03 GMT+0000 (Coordinated Universal Time)
కవిత హైదరాబాద్ రాగానే ఏం చేయనున్నారంటే?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లలేదు. కవిత తల్లి శోభారాణి మాత్రం ఒకసారి ఢిల్లీ వెళ్లి కవితను తీహార్ జైలులో కలసి వచ్చారు.
కేసీఆర్ వద్దకు వెళ్లి...
కేసీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్లలేదు. దీంతో తొలుత కేసీఆర్ వద్దకు వెళ్లి కల్వకుంట్ల కవిత ఆశీర్వాదం తీసుకోనున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందిహిల్స్ లోని ఆయన ఇంటికి వచ్చినట్లు తెలిసింది. కవిత వస్తుందని తెలియడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన ఇంటికి చేరుకోనున్నారు. దీంతో కవిత తొలుత కేసీఆర్ ఇంటికి వెళ్లి అక్కడ తల్లి దండ్రులను కలుసుకుని తర్వాత తన ఇంటికి వెళ్లనున్నారు.
Next Story