Mon Jan 06 2025 11:58:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్కు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్కు రానున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్కు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరైన కవిత రెండు రోజుల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒకసారి విచారణకు వెళ్లారు. తిరిగి ఈ నెల 16న కవితను విచారణకు పిలవగా ఆమె గైర్హాజరయ్యారు.
ఈ మెయిల్ ద్వారా...
తిరిగి ఈ నెల 20, 21 తేదీల్లో ఈడీ అధికారుల ఎదుట కల్వకుంట్ల కవిత హాజరై ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పది సెల్ఫోన్లను కూడా ఈడీకి కవిత సమర్పించారు. నిన్న విచారణ ముగిసిన అనంతరం ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం, ఈరోజు విచారణ లేదని ఈడీ అధికారులు చెప్పడంతో కవిత ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. తిరిగి ఎప్పుడు విచారణకు పిలిచేది మెయిల్ ద్వారా సమాచారం ఇస్తామని ఈడీ అధికారులు కవితకు, ఆమె న్యాయవాదికి చెప్పినట్లు తెలిసింది.
Next Story