Mon Dec 23 2024 13:35:48 GMT+0000 (Coordinated Universal Time)
కవిత కేసు వచ్చే శుక్రవారానికి వాయిదా
సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసు ఈ నెల 16వ తేదీకి విచారణ వాయిదా పడింది.
సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత కేసు ఈ నెల 16వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన బేలా అండ్ త్రివేది ధర్మాసనం విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని ఆమె తప్పుపడుతున్నారు. మహిళలను విచారించడానికి ప్రత్యేక పద్ధతులు పాటించాలని కోరుతున్నారు. అభిషేక్ బెనర్జీ పిటీషన్ ను కూడా 16న విచారిస్తామని తెలిపారు. అన్ని కేసులు ఒకేసారి విచారిస్తామని ధర్మాసనం పేర్కొనింది.
Next Story