Wed Jan 08 2025 18:26:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు పోలీసులు ఆంక్షలు విధించారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు పోలీసులు ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ వద్ద సగం స్థలం మాత్రమే వాడుకోవాలని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద దీక్ష ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కవితకు ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. జంతర్ మంతర్ లో సగం స్థలంలో మాత్రమే దీక్షకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి ప్రకారమే...
ముందుగా ఢిల్లీ పోలీసులు ఇచ్చిన అనుమతి మేరకు తాము దీక్ష చేపడతామని కవిత చెప్పారు. బీజేపీ నేతలు ఇక్కడ దీక్ష చేస్తున్నట్లు పోలీసులు తెలిపారన్నారు. తాము ఐదువేల మందితో దీక్ష చేయడానికి అనుమతి తీసుకున్నామని కవిత తెలిపారు. ఢిల్లీ పోలీసులు సహకరిస్తారని భావిస్తున్నామని తెలిపారు. తాము అడిగిన స్థలంలో ఇప్పుడు సగం మాత్రమే ఇస్తారని చెబుతున్నారని, ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని కవిత మీడియా ప్రతినిధులకు తెలిపారు.
Next Story