Sat Nov 23 2024 01:31:36 GMT+0000 (Coordinated Universal Time)
Breaking కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. మూడున్నర నెలల నుంచి జైలులోనే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది. కల్వకుంట్ల కవిత నేటితో ముగిసింది. దీంతో కవితను నేడు రౌస్ అవెన్యూ కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఏప్రిల్ 11వతేదీన సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ హైకోర్టులో...
అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటీషన్ ను తిరస్కరించగా ఆమె తరుపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు మైనర్ కుమారుడు ఉన్నాడని, అతడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కవితపై ఉందని కవిత తరుపున న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఎలా చెప్పనుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story