Mon Dec 23 2024 01:07:26 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేటితో ముగియనున్న కవిత రిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.
రెండు నెలల నుంచి...
మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను హైదరాబాద్ ను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవితను విచారించారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సీబీఐ కూడా ఇదే కేసులో కవితపై కేసు నమోదు చేసింది. దీంతో సీఐఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Next Story