Mon Dec 23 2024 00:21:02 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను నేడు రౌస్ అవెన్యూ కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఏప్రిల్ 11వతేదీన సీబీఐ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ హైకోర్టులో...
అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటీషన్ ను తిరస్కరించగా ఆమె తరుపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో కవితకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఎలా చెప్పనుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story