Mon Dec 23 2024 05:12:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కవితను కలవనున్న కేటీఆర్, హరీశ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు తీహార్ జైలులో కేటీఆర్, హరీశ్‌రావులు ములాఖత్ కానున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు తీహార్ జైలులో కేటీఆర్, హరీశ్‌రావులు ములాఖత్ కానున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్న నేతలు పార్టీ ఫిరాయింపులపై న్యాయనిపుణులపై చర్చించరు. సుప్రీంకోర్టులో పార్టీ నుంచి ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటీషన్ వేయాలని నిర్ణయించారు. దానం నాగేందర్, వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ వేశారు.
అనర్హత వేటు విషయంలో...
వారిపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించనుంది. ఈ పరిస్థితుల్లో మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసిన కవితను కూడా కేటీఆర్, హరీశ్‌రావులు పరామర్శించనున్నారు. జైలులో కవితకు అందుతున్న సదుపాయాలను గురించి అడిగి తెలుసుకోనున్నారు. రేపు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.
Next Story