Mon Dec 23 2024 01:41:18 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆమె ఢిల్లీకి కొద్దిసేపటి క్రితం వెళ్లారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆమె విమానంలో ఢిల్లీకి కొద్దిసేపటి క్రితం వెళ్లారు. అయితే ఢిల్లీ వెళ్లే ముందు తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో కవిత ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. కార్యక్రమాలను కొనసాగించుకోవాలని, ఆదోళన చెందాల్సిన పనిలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలిసింది. న్యాయపరంగా బీజేపీ అకృత్యాలపై పోరాడదామని, పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు ఫోన్ లోనే భరోసా ఇచ్చారు కేసీఆర్.
11న ఈడీ ముందుకు...
అయితే కవిత తన విచారణను 15వ తేదీకి విచారణకు వస్తానని, అప్పటి వరకూ వాయిదా వేయాలని కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే పదో తేదీన జంతర్ మంతర్ వద్ద దీక్షలో పాల్గొనేందుకు ఈడీ అవాశమిచ్చినట్లు తెలిసింది. అయితే 11వ తేదీన హాజరు కావాలని కోరినట్లు సమాచారం. మహిళ రిజర్వేషన్ బల్లును అమలులోకి తేవాలంటూ కవిత ఢిల్లీలో ధర్నా చేయడానికి బయలుదేరి వెళ్లారు.
Next Story