Sun Dec 22 2024 14:27:07 GMT+0000 (Coordinated Universal Time)
మోడీ నోటీసు వచ్చింది : కవిత
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఏడాదిగా టీవీ సీరియల్ గా నడుస్తుందన్నారు. మోడీ నోటీసు వచ్చిందని ఆమె ఎద్దేవా చేప్పారు. దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, ఎన్నికలు వస్తున్న సమయంలో మరొక కొత్త ఎపిసోడ్ తీస్తున్నారన్నారు. రాజకీయ కక్షతోనే నోటీసు వచ్చిందని కల్వకుంట్ల కవిత అన్నారు. అది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
లీగల్ టీంకు...
ఈడీ నోటీసును తమ పార్టీ లీగల్ టీంకు పంపామని వారు చెప్పినట్లు తాము నడుచుకుంటామని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. దీనిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు కవిత విచారణకు హాజరుకావాల్సి ఉంది.
Next Story