Mon Dec 23 2024 04:29:23 GMT+0000 (Coordinated Universal Time)
KCR : పార్టీని వీడొద్దు... మంచి భవిష్యత్ ముందుంది
బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ లతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సమావేశమయ్యారు. ఫాం హౌస్ లో ఈ భేటీ జరిగింది.
బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ లతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సమావేశమయ్యారు. ఫాం హౌస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి నలుగురు జడ్పీ ఛైర్మన్లు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారని తెలిసింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పార్టీని వీడి ఎవరూ వెళ్లవద్దని, తెలంగాణ భవిష్యత్ ఉన్నది బీఆర్ఎస్ కు మాత్రమేనని తెలిపారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత...
ఈ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందని, ఓపిక పట్టాలని, పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ వారితో అన్నట్లు తెలిసింది. వచ్చే రోజుల్లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ విజయం తథ్యమని ఆయన అన్నారు. ఎవరూ ప్రలోభాలకు లోనుకావద్దని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story