Mon Dec 23 2024 03:16:29 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు మూడు జిల్లాలకు కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రానున్నారు
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కేసీఆర్ బహిరంగ సభలు జరగనున్నాయి. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులను పరిచయం చేస్తూ, కాంగ్రెస్, బీజేపీ పై విమర్శలు గుప్పిస్తూ మరోసారి బీఆర్ఎస్ కు అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
యాగం ముగిసిన వెంటనే...
ఈరోజు కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరుగుతున్న రాజశ్యామల యాగం ముగియనుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ప్రచార కార్యక్రమానికి బయలుదేరి వెళతారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని భైంసా, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో, జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగే సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను పార్టీ నేతలు చేశారు.
Next Story