Sun Dec 22 2024 14:47:41 GMT+0000 (Coordinated Universal Time)
సింగరేణి ఎన్నికల విషయంలో ఇలా డిసైడ్ అయిన కేసీఆర్
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు. వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్లో ఎందుకుండాలని అంటున్నారు. ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని మిర్యాల రాజిరెడ్డి అన్నారు.
ఇక సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. గతంలో ఆదేశించిన విధంగా ఈ నెల 27న యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. డిసెంబరు చివరి వారంలో హైకోర్టు పేర్కొన్న తేదీన కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున పరిపాలనాపరమైన ఇబ్బందుల దృష్ట్యా సింగరేణి ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంధన శాఖ కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయని, సింగరేణి ఎన్నికలకు బందోబస్తు కల్పించాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ఎన్నికలు వాయిదా వేయడానికి తగిన కారణాలు ఏమీ కనిపించడం లేదని హై కోర్టు తెలిపింది. ఇక 2017లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ విజయం సాధించింది.
Next Story