Mon Dec 23 2024 11:44:26 GMT+0000 (Coordinated Universal Time)
పొంగులేటి వర్గంపై సస్పెన్షన్ వేటు
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ చర్యలు ప్రారంభించింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై సస్పెండ్ వేటు వేస్తుంది
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ చర్యలు ప్రారంభించింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై సస్పెండ్ వేటు వేస్తుంది. మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులను 20 మంది వరకూ బీఆర్ఎస్ అధినాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకుంది. కొందరిని నామినేటెడ్ పదవుల నుంచి కూడా తొలగించారు. ఇటీవల పొంగులేటి ఆత్మీయ సమావేశాల పేరుతో అధికార పక్షంపై విమర్శలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది.
పార్టీ క్రమశిక్షణకు...
మధిర నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వారిపై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో హడావిడి చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ కు చికాకుగా మారింది. కొందరు నేతలు పొంగులేటి వెంట వెళుతుండటంతో వారిపై ముందుగానే సస్పెండ్ వేయాలని నిర్ణయించింది. పార్టీ ఉపేక్షిస్తే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన హైకమాండ్ సస్పెన్షన్లతో జవాబు చెప్పాలనుకుంటుంది.
Next Story