Thu Mar 27 2025 13:06:42 GMT+0000 (Coordinated Universal Time)
KTR : హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో పిటీషన్ వేశారరు.ఇటీవల తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించి తనపై పోలీసులు కేసులు నమోదు చేశారని కేటీఆర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగం పెట్టిన కేసులేనని ఆయన పేర్కొన్నారు.
వివిధ కార్యక్రమాల్లో...
ఇటీవల కేటీఆర్ రైతు దీక్షల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వరసగా కేసులు నమోదు అవుతుండటంతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలని కోరారు.
Next Story