Sun Dec 22 2024 21:48:25 GMT+0000 (Coordinated Universal Time)
KTR : హైదరాబాద్ లోనే ఉన్నా.... పంపండి...రేవంత్ సర్కార్ కు కేటీఆర్ కు సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా తనను అరెస్ట్ చేయడానికి రావచ్చని అన్నారు. వారిచేతనే మీ బర్త్ డే కేక్ కట్ చేస్తానని తెలిపారు. వారికి ఉస్మానియా బిస్కెట్లు, చాయ్ నుకూడా అందిస్తానని తెలిపారు.
శుభాకాంక్షలు తెలుపుతూనే...
రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే మరొక వైపు ఈ రకమైన పోస్టును కేటీఆర్ పెట్టడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఫార్ముల ఈ రేస్ లో కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story