Tue Dec 24 2024 00:52:48 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్.. నీకు ఆ దమ్ముందా? నీ అంత పిరికోడు లేడు
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజిగిరిలో పోటీకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజిగిరిలో పోటీకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే తాను కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి పిరికోడు అని, మాటలు ఎక్కువ, సవాల్ స్వీకరించే దమ్ములేదని, తాను మల్కాజ్గిరిలో పోటీ చేయాలన్న సవాల్ కు స్పందించకుండా పారిపోయాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ బలాన్ని చూసి రేవంత్ రెడ్డి ఇటు వైపు కూడా చూడటం లేదని అన్నారు.
రెండూ ఒకటే...
సెక్రటేరియట్లో లంకె బిందెల సంగతేమో కానీ… హైదరాబాద్ నగరంలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి… నరేంద్ర మోడీని చౌకీదారు చోర్ హై అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడే భాయ్ అంటున్నారన్నారు. తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారని, గుజరాత్ మోడల్ అంటే గోద్రా హింస చేస్తారా? బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల పైకి నడిపిస్తారా? రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. నువ్వు రాహుల్ గాంధీ మనిషివా… నరేంద్ర మోడీ మనిషివా… బీజేపీ మనిషివా… కాంగ్రెస్ నేతవా… ఏదో చెప్పు అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేసినా, అది నేరుగా బీజేపీకి లాభం జరుగుతుందన్నారు.
Next Story