Wed Mar 26 2025 23:35:32 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కాంగ్రెస్ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలే
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందరికీ రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారంటూ ఆయన ధ్వజమెత్తారు.రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి ఎక్కని గుడిలేదని, మొక్కని దేవుడు లేదని, చేయని శపథం లేదని, ఆడని అబద్ధం లేదంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే వాటిని వదిలేసిందని కేటీఆర్ అన్నారు.
కొందరికే రుణమాఫీ...
తెలంగాణ రైతులకు ఇందిరమ్మ రాజ్యంలో గుండెల్లో గునపం దిగిందని కేటీఆర్ అన్నారు. వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిందన్న కేటీఆర్ అధికారం దక్కిన తర్వాత కొందరికే రుణమాఫీ అంటూ మోసం చేశారన్నారు. ఓట్లు దండుకుంని, ఢిల్లీకి మూటలు పంపుతూ పబ్బం గడుపుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కుటుంబంలో ఒకరికే రుణమాఫీ అంటూ కొర్రీలు వేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Next Story