Mon Dec 23 2024 05:30:27 GMT+0000 (Coordinated Universal Time)
KTR : తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించండి
తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు
తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రమంతటా విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలతో విస్తరించి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డెంగ్యూ కారణంగా ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోయినట్లు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారని తెలిపారు.
సరైన సౌకర్యాలు లేక...
ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని, ఒక బెడ్ పై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారని కేటీఆర్ ఆవేదన చెందారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారని, ఈ వ్యాధులు మరింత ముదరకముందే ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కేటీఆర్ కోరుతూ ట్వీట్ చేశారు.
Next Story