Fri Mar 14 2025 09:35:27 GMT+0000 (Coordinated Universal Time)
KTR : ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలని వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై తక్షణ విచారణ జరపాల్సిన అవసరం లేదని సీజేఐ తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
జనవరి 15వ తేదీన...
జనవరి 15వ తేదీన క్వాష్ పిటీషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది. దీంతో విచారణకు పదిహేనో తేదీ వరకూ సుప్రీంకోర్టు విచారించమని తెలపడంతో కేటీఆర్ కు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Next Story