Sun Dec 22 2024 21:52:09 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ కు బండి సంజయ్ కు లీగల్ నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ ఇచ్చారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని బండి సంజయ్ తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. దానికి బదులుగా బండి సంజయ్ కూడా లీగల్ నోటీసు ద్వారానే సమాధానమిచ్చారు.
వెనక్కు తీసుకోవాలని...
కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బండిసంజయ్ బదులిచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పకపోయినా, బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా తాను కూడా న్యాయపరమైన చర్యలకు దిగుతానని బండి సంజయ్ హెచ్చరించారు. తాను చేసిిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి సంజయ్ తేలిపారు.
Next Story