Fri Dec 20 2024 17:36:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : KTR : హైకోర్టులో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్
కేటీఆర్ పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలన్న పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. పది రోజుల వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ పిటీషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలన్న పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తమ వాదనలను ఇటు అడ్వకేట్ జనరల్,అటు కేటీఆర్ తరుపున న్యాయవాది వినిపించారు.
ఈ నెల 27వ తేదీకి విచారణ వాయిదా..
విదేశీ కంపెనీలకు ప్రజాధనం బదలీ అయిందని ఏజీ తెలిపారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ పై తప్పుడు కేసు నమోదయిందని ఆయన తరుపున న్యాయవాది తెలిపారు. ప్రతి విషయంలో ఎఫ్ఐఆర్ ఉండదని, విచారణలో నిధులు అందుకున్న కంపెనీపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఏజీ తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేటీఆర్ పై కేసు నమోదయిందని తెలిపారు. వారం రోజుల వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించడంతో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. వారం రోజులకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. తిరిగి ఈ నెల 27వ తేదీన విచారణ చేపడతామని తెలిపింది. ఏసీబీకి దర్యాప్తు సహకరించాలని కోరింది. విచారణకు కేటీఆర్ కు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల ౩౦వ తేదీలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story