Mon Dec 23 2024 06:40:52 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్కు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి ఆహ్వానం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది
KTR :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అమెరికా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని కేటీఆర్ కు ఆహ్వానం అందింది. వచ్చే నెల 13వ తేదీనర ఇల్లినాయ్ లో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు - సవాళ్లు అనే అంశంపై చర్చలో పాల్గొనాల్సిందిగా నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్ కు ఆహ్వానం అందింది.
పారిశ్రామిక రంగంపై...
ఈ కాన్ఫరెన్స్ లో ఆయనను ప్రసంగించాలని కోరింది. గతంలో తొమ్మిదేళ్ల పాటు తెలంగాణలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించింది. పెట్టుబడులు వచ్చేందుకు తీసుకు రావాల్సిన పాలసీలు, అమలుపర్చిన విధానలపై వివరించాలని యూనివర్సిటీ కేటీఆర్ ను కోరింది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో పారిశ్రామిక రంగంలో సాధించి విజయాలను గురించి తమ ప్రసంగంలో ప్రస్తావించాలని యూనివర్సిటీ అధికారులు కేటీఆర్ ను కోరారు.
Next Story