Thu Dec 26 2024 01:13:39 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ ట్వీట్.. బీ అలెర్ట్.. రెండు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో రెండు రోజుల్లో ఏదో జరగబోతుందన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు. ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిచెబుతూనే అందరూ అలెర్ట్ గా ఉండాలంటూ క్యాడర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నట్లు అర్థమొచ్చేలా ఆయన ట్వీట్ ఉంది. దీంతో బీఆర్ఎస్ నేతలతో పాటు సానుభూతి పరులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.
ట్వీట్ లో ఏముందంటే?
రెండు రోజులుగా జరుగుతుంది కేవలం ఆరంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వవద్దు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story