Sun Dec 22 2024 18:44:33 GMT+0000 (Coordinated Universal Time)
KTR : దేవుళ్ల మీద ఒట్లెందుకు రేవంతూ.. మీ కుటుంబ సభ్యుల మీద వేసి చెప్పవే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. దేవుళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకు? తన భార్య, పిల్లల మీద ఒట్టు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
వాళ్లు అడగరనా?
ఎందుకంటే దేవుళ్లు అడగరని కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మళ్లీ ప్రజలను మోసం చేస్తాడని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలను ముందు అమలు చేసి అప్పుడు మాట్లాడాలని సవాల్ విసిరారు.
Next Story