Mon Dec 23 2024 05:14:18 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ కీలక సమావేశం...ఆ ఎన్నికపైనే
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఈర్ నేతలతో సమావేశమయ్యారు.
నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఈర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అనుసరించాల్సిన వ్యూహాలపై...
ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావడంతో ఓటర్లు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయాలని కేటీఆర్ నేతలకు సూచించనున్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికద్వారా తమ వాయిస్ ను తెలపాలంటూ ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ కు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది.
Next Story