Mon Dec 23 2024 05:07:45 GMT+0000 (Coordinated Universal Time)
తీహార్ జైల్లో ఉన్న కవితను కలిసిన కేటీఆర్
తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు
తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. శుక్రవారం కలిసి కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కవిత దాదాపు మూడు నెలల నుంచి జైలులోనే ఉన్నారు.
మూడు నెలల నుంచి....
మార్చి 15వ తేదీన కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సీఐడీ కూడా ఇదే కేసులో ఆమెను విచారించి కేసు నమోదు చేసింది. కవిత అనేక సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. దీంతో ఈనెల 21వ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీన జరుగనుంది.
Next Story