Sun Dec 22 2024 23:15:51 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్కు తృటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్ నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు
ఆర్మూర్ నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన జీవన్ రెడ్డి నామినేషన్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళుతుండగా ఒక్కసారి వాహనానికి ఉన్న రెయిలింగ్ విరిగిపోయి కిందపడబోయారు. అయితే పక్కనే ఉన్న గన్మెన్ లు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
నామినేషన్ కార్యక్రమానికి...
అయితే ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డిలు మాత్రం వాహనం నుంచి కింద పడిపోయారు. అయితే వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సజావుగానే పూర్తి అయింది. ఓపెన్ టాప్ జీపు కావడంతో ఒక్కసారిగా అందరూ రెయిలింగ్ ను పట్టుకోవడంతో బరువు ఆపలేక అది విరిగిపోయిందని చెబుతున్నారు.
Next Story