Mon Dec 23 2024 06:12:23 GMT+0000 (Coordinated Universal Time)
KTR : మాది నిజం.. మీది అబద్ధం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. తమది నిర్మాణమని, కాంగ్రెస్ పాలనలో విధ్వంసం అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. తాము నిర్మిస్తే, మీరు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. లక్షల నిర్మాణాలు తమ ప్రభుత్వ హయాంలో జరిగితే లక్షల కూల్చివేతలు మీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్నాయని దుయ్యబట్టారు. మూసీ నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
విషప్రచారాలు...
కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదేనన్నారు. తాము లక్ష ఇళ్లు కట్టకపోతే రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు. చిట్టీ .. తమ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా..?అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా..? అని ఫైర్అయ్యారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఈరోజు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయన్నారు.కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం..మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి అంటూ హితవు పలికారు.
Next Story