Sat Dec 28 2024 10:21:10 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్
గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు
గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన ఎక్స్ లో ఈ మేరకు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజాలను ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకు అడ్డుకుంటున్నారు?
బీఆర్ఎస్ పార్టీ గాంధీ ఆసుప్రతిలో జరుగుతున్న వ్యవహారంపై పరిశీలనకు ముగ్గురు నిపుణులైన డాక్టర్లతో నిజనిర్ధారణ కమిటీ తమ పార్టీ వేసిందని, ఆ కమిటీ పర్యటించకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా నిజాలు దాగవని కేటీఆర్ అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేంత వరకూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
Next Story