Fri Nov 22 2024 08:11:27 GMT+0000 (Coordinated Universal Time)
KTR : సుంకిశాల పాపం ఈ ప్రభుత్వానిదే
సుంకిశాల ప్రాజెక్టు వద్ద గోడ కూలిపోవడాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని కేటీఆర్ ప్రశ్నించారు.
సుంకిశాల ప్రాజెక్టు వద్ద గోడ కూలిపోవడాన్ని ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటఆర్ ప్రశ్నించారు. ఆగస్టు 2వ తేదీన ఘటన జరిగితే ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియదంటే సిగ్గుచేటని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు వద్ద గోడకూలిపోవడం అత్యంత విషాదకరమని తెలిపారు.
కేంద్రం స్పందించాలి...
త్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. మున్సిపల్ శాఖను తనవద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డలో ఏదైనా జరిగితే వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతోనే సుంకిశాల గోడ కూలిందని కేటీఆర్ అన్నారు.
Next Story