Thu Nov 21 2024 23:11:48 GMT+0000 (Coordinated Universal Time)
KTR : జన్వాడ ఫాం హౌస్ పార్టీపై కేటీఆర్ ఏమన్నారంటే?
జన్వాడ ఫాం హౌస్ లో జరిగిన పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
జన్వాడ ఫాం హౌస్ లో జరిగిన పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమను ఎదుర్కొనలేక తమ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు దిగుతుందని అన్నారు. చేసిన హామీలను నెరవేర్చలేని ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాడుతున్న తమను వేధిస్తూ తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులను నమోదు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే తప్పుడు మార్గాలు అనుసరిస్తుందన్న కేటీఆర్ ఒక గృహప్రవేశం జరిగితే దానిని పార్టీగా చిత్రీకరించి కేసులు నమోదు చేశారన్నారు. అందులోనే పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయినా సరే తాము తగ్గేది లేదన్నారు.
వెనక్కు తగ్గం...
తాము ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ధైర్యముంటే శాసనసభ ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసత్య ప్రచారంతో తమ కుటుంబాన్ని వీధిన పడేయాలని చూడటం కుట్రలో భాగమేనని అన్నారు. వెనక్కు వెళ్లమని, భయపడేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెండాడుతూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తన వరస వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు దిగుతుందన్నారు. తాము తండ్రి నేర్పిన బాటలో ఉద్యమిస్తూ రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. తాము లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం రాదని తనకు తెలుసునన్న ఆయన, అక్రమ కేసులను తాము ఎలా ఎదుర్కొనాలో తెలుసునన్నారు.
Next Story