Sun Dec 22 2024 21:09:11 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి అవినీతిపై దర్యాప్తు జరపాల్సిందే : కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది బీజేపీకి లిట్మస్ టెస్ట్ వంటిదన్నారు. అమృత్ 2 పథకంలో భాగంగా పెద్దయెత్తున అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. 8,888 కోట్ల పనులపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి చెందిన కంపెనీకి పెద్దయెత్తున టెండర్లను అప్పగించారన్నారు. 11,307 పనులను అప్పగించారని కేటీఆర్ అన్నారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను...
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ పథకంలో భాగంగా జరిగిన అవినీతిపై విచారణ జరపాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని కేటీఆర్ తెలిపారు. అమత్ 2.0 పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అప్పగించిన పనులపై జరిగిన అవినీతిపై విచారణ జరపాల ఆయన డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లలో అవినితి స్పష్టంగా కనిపిస్తుందన్న కేటీఆర్ సంక్షేమ పథకాలకు మాత్రం డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తమ పదవులు వదులుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు
Next Story