Sun Dec 22 2024 21:52:09 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్ అవినీతిని బయటపెట్టా.. ఇవిగో .. ముందే చెబుతున్నా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిని తాను ముందే బయటపెడుతున్నానని, ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిని తాను ముందే బయటపెడుతున్నానని, ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక్కడ అనేక రకాలుగా దోచేసిన రేవంత్ రెడ్డి ఇటు ఢిల్లీకి, అటు మహారాష్ట్ర ఎన్నికలకు నిధులను తరలిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీకి పెద్దయెత్తున మూటలు పంపుతున్నారన్న కేటీఆర్ అనేక మంది నుంచి వసూలు చేసిన డబ్బును ఢిల్లీకితరలించి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోళ్లు...
ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. గుట్టలను మట్టి చేసే భూదాహం తీర్చుకోవడం కాదని, గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశులవైపు చూడమని రేవంత్ కు హితవు పలికారు. మూసీ ముసుగులు తొలిగించి, కల్లంలో కాటాలు ఎప్పుడు వేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రైతలకు బోనస్ ఎగ్గొట్టమే కాకుండా వారికి కనీస మద్దతు ధర కూడా లేకుండా చేస్తూ ఇబ్బంందుల పాలు చేస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు.
Next Story