Sun Apr 06 2025 04:33:44 GMT+0000 (Coordinated Universal Time)
KTR : ఆ ల్యాండ్ కొనేవారికి కేటీఆర్ వార్నింగ్
కంచె గచ్చిబౌలి భూమిలో ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే తాము అధికారంలోకి రాగానే వెనక్కు తీసుకుంటామనికేటీఆర్ తెలిపారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కంచె గచ్చిబౌలి భూమిలో ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే తాము అధికారంలోకి రాగానే వెనక్కు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పర్యావరణానికి తమ పార్టీ పెద్ద పీట వేస్తుందన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్రాన్ని నడపాలని భావిస్తుందని కేటీఆర్ అన్నారు.
కొన్నవారు నష్టపోక తప్పదు...
ఆ కంచె గచ్చిబౌలి భూములు కొన్నవారికి తాము మూడేళ్ల ముందే చెబుతున్నామని, ఎవరైనా కొంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. తాము మూడేళ్ల తర్వాత అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పుడు ప్రభుత్వం విక్రయించిన భూములను వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు. తాము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడతామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
Next Story