Thu Jan 16 2025 16:27:02 GMT+0000 (Coordinated Universal Time)
KTR : ఇది రైతు వ్యతిరేరక ప్రభుత్వం : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరులో రైతులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతుందని కేటీఆర్ అన్నారు.
ఏ ఒక్క హామీని...
ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా అమలుపర్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ అంటూ తప్పుడు నాటకాలు ఆడుతూ రైతులను మభ్యపెడుతున్నారని అని అన్నారు. ఫార్మాసిటీని తొలగించి ఫోర్త్ సిటీ పేరుతో మరో డ్రామాకు తెరతీశారన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యాయస్థానాలు అంటే కూడా ఈ ప్రభుత్వానికి భయం లేకుండా పోయిందన్న కేటీఆర్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరారు. రైతు భరోసా నిధులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
Next Story