Fri Nov 22 2024 15:49:57 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేవంత్ ట్రాప్ లో కేటీఆర్ సులువుగా పడిపోతున్నారా? ఎప్పుడూ లేనిది ఇప్పడే ఎందుకిలా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడిపోతున్నట్లు కనిపిస్తుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఫ్రస్టేషన్ లో ఏదో ఒకటి మాట్లాడి అనవసర వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఆయనకు ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తరచూ కాంట్రవర్సీకి లోనై నోరు జారిన కామెంట్స్ కు క్షమాపణలు చెబుతున్నారు. ఇది పక్కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ లో భాగంగా ఆడుతున్నది తెలిసినా అనుకోకుండా, అకస్మాత్తుగా పెదవి జారి ఇబ్బందుల్లో కేటీఆర్ పడుతున్నారు. ఇది బీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశంగా మారింది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు....
రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలుకు సమాధానాలు సరైన రీతిలో చెప్పాలని భావిస్తూ కేటీఆర్ తప్పిదాలు చేస్తున్నారంటున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయినా ఆయనకు ఎవరిని ఎలా ట్రాప్ లోకి రాగాలో తెలియంది కాదు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కొంత సౌమ్యుడిగా పేరుంది. ఆయన నోటి నుంచి అసభ్యపదజాలం రాదు. చాలా ఆచితూచి మాట్లాతారన్న పేరుంది. తండ్రి కేసీఆర్ వాగ్దాటిని అందిపుచ్చుకున్న కేటీఆర్ రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా వ్యహరిస్తారన్న పేరుంది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయన మాట్లాడే శైలి చాలా మందికి నచ్చుతుంది. అందుకే ఆయనకు వ్యక్తిగతంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
పదవులు కేటాయించి...
ఇక తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీఆర్ కుటుంబానికి పదవులు కేటాయించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని ఆయన తెలిపారు. అది ఎప్పటి నుంచో వస్తున్న రాజకీయ విమర్శే. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కుటుంబానికి పదవులు కూడా ఇచ్చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ ను విలీనం చేస్తే కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారన్న ఒప్పందం కుదిరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారన్నారు. ఇక కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని కూడా గట్టిగానే రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు
మహిళల ప్రయాణంపై...
ఎందుకంటే బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని, వారందరినీ బేషరతుగా బీఆర్ఎస్ లోకి పంపిస్తే పదవులు వస్తాయని చెప్పారు. కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావుకు శాసనసభలో ప్రతిపక్ష నేత బాధ్యతలను అప్పగిస్తారని కూడా పోస్టింగ్ ఇచ్చేశారు. అయితే వీటిని ఖండించాల్సిన కేటీఆర్ మళ్లీ నోరు జారి ఇబ్బందుల్లో పడ్డారు. అలాగే సీతక్క ఉచిత మహిళల ప్రయాణంపై కూడా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుగా మాట్లాడి తలనొప్పిని తెచ్చుకున్నారు. చివరకు క్షమాపణ చెప్పినా కేటీఆర్ కు మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇలా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన వలలో చిక్కుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story