Mon Dec 23 2024 00:47:18 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ కు వైరల్ ఫీవర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైరల్ ఫీవర్ కు గురయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైరల్ ఫీవర్ కు గురయ్యారు. ఆయన గత ముప్ఫయి ఆరు గంటల నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. వాస్తవానికి కేటీఆర్ నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాల్సి ఉంది.
అండగా నిలుస్తామంటూ...
హైడ్రా బాధితులకు అండగా నిలుస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో వారంతా నేడు పార్టీ కార్యాలయానికి వచ్చారు. అయితే కేటీఆర్ కు వైరల్ ఫీవర్ రావడంతో హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైడ్రా బాధితుల కోసం పార్టీ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు న్యాయ విభాగం పనిచేస్తుందని హరీశ్ రావు తెలిపారు. హైడ్రా బాధితులకు అండగా తమ పార్టీ నిలుస్తుందని హరీశ్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి న్యాయసహాయం పొందవచ్చని హైడ్రా బాధితులకు హరీశ్ రావు భరోసా ఇచ్చారు.
Next Story