Thu Jan 16 2025 05:07:09 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నేడు ఈడీ ఎదుటకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కారు రేసు అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ కేటీఆర్ ను విచారించిన నేపథ్యంలో నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈరోజు ఉదయం నందినగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసులో కేటీఆర్ ను విచారణ చేయనుంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా యాభై నాలుగు కోట్ల రూపాయల నిధులను విదేశీసంస్థలకు మళ్లించడంపై ఈడీ ఆరా తీయనుంది.
కేసు నమోదు చేసిన ఈడీ...
ఈడీ ఇప్పటికే కేటీఆర్ పై ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ అభియోగాలతో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్న ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎఉఉస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారణ చేసింది. ఈడీ కూడా ఇద్దరు అధికారులను విచారించింది. కేటీఆర్ క్వాష్ పిటీషన్ కూడా సుప్రీంకోర్టులో కొట్టివేయడంతో ఉన్న ఒక్క ఆశ కూడా పోయినట్లయింది. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నెలకొంది.
Next Story