Mon Dec 15 2025 04:04:28 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. నేటి నుంచి వరసగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ, ప్రజలతో మమేకమవుతూ ఆయన పర్యటనలు సాగననున్నాయి.
ముఖ్య కార్యకర్తలతో...
ఉమ్మడి జిల్లాల ముఖ్య కార్కకర్తలతో సమావేశమవుతారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడతారు. ఇక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించాలని కార్యకర్తలను, నేతలను కోరనున్నారు. నేడు సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.వరసగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు కొనసాగనున్నాయి. సాయంత్రం కుత్బుల్లాపూర్ లో జరిగే ఇఫ్తార్ విందుకు కేటీఆర్ హాజరు కానున్నారు.
Next Story

